కోడలే కొడుకైంది.. మామకు తలకొరివి పెట్టిన కోడలు
అనారోగ్యంతో మరణించిన మామకు తానే కొడుకై తలకు కొరివి పెట్టింది కోడలు.
దిశ, ఏలూరు: అనారోగ్యంతో మరణించిన మామకు తానే కొడుకై తలకు కొరివి పెట్టింది కోడలు. ఏలూరు తూర్పు వీధి లో నివసిస్తున్న యర్రంశెట్టి నరసింహారావు వ్యవసాయ శాఖలో పనిచేసి రిటైరయ్యారు. ఆయనకు ఒక్కగానొక్క కొడుకు. అతనికి పెళ్లి చేసి, శేష జీవితం ప్రశాంతంగా సాగిద్దామనుకున్నారు. విధి వక్రించి కొడుకు గతంలో కన్నుమూశాడు. నరసింహారావు అనారోగ్యంతో సోమవారం ఉదయం చనిపోయారు. ఆయనకు కొడుకు లేకపోవడంతో కోడలు కొడుకై అంత్యక్రియలు శ్రద్ధతో నిర్వహించింది.