లాంఛనం పూర్తి.. అమరావతి పనులు ఇక పరుగులే..!
ఇక నుంచి జెట్ స్పీడ్‌లో ఏపీ కేపిటల్ నిర్మాణ పనులు జరగనున్నాయి....
దిశ, వెబ్ డెస్క్: ఇక నుంచి జెట్ స్పీడ్‌లో ఏపీ కేపిటల్(AP Capital) నిర్మాణ పనులు జరగనున్నాయి. అమరావతి(Amaravati) అభివృద్ధికి రూ.11 వేల కోట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం-హడ్కో(Government-HUDCO) మధ్య ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ రుణానికి సంబంధించి తాజాగా సీఆర్డీఏ(CRDA)తో హడ్కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కుల్ కృష్ణ(Hudco Chairman and Managing Director Kul Krishna) ఒప్పంద పత్రాలపై మంత్రి నారాయణ(Minister Narayana) సమక్షంలో సంతకాలు చేశారు. ఈ ఉదయం ఢిల్లీ నుంచి అమరావతికి వచ్చిన ఆయన.. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణతో పాటు సీఆర్డీఏ అధికారులను కలిశారు. అన్ని స్థాయిల్లోనూ చర్చలు సఫలం కావడంతో ఒప్పందాన్ని ఆయన లాంఛనం చేశారు. దీంతో అమరావతి అభివృద్ధికి రూ. 11 వేల కోట్ల రుణం అందినట్లైంది.
మరోవైపు ఏపీ రాజధానిని అభివృద్ధి చేసేందుకు ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులు సైతం ఇప్పటికే ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండు బ్యాంకుల నుంచి రూ.15 వేల కోట్ల రుణం కూడా ప్రభుత్వానికి లభించింది. తాజాగా హడ్కో నుంచి రూ. 11 వేల కోట్ల నిధులు అందుబాటులోకి రానున్నాయి. దీంతో రూ. 26 వేల కోట్లతో అమరావతి నిర్మాణ పనులను కూటమి సర్కార్ చేపట్టనుంది. ఇందులో భాగంగా కొన్ని పనులకు టెండర్ల ప్రక్రియను కూడా పూర్తి చేసింది. నవ్యాంధ్ర కొత్త రాజధాని అమరావతి పనులు ఊపందుకోనున్నాయి.