Land Grabbing Act:ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రద్దు.. కారణమిదే!

ఏపీలో నేడు(బుధవారం) సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది.

Update: 2024-11-06 09:24 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో నేడు(బుధవారం)  సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రొహిబిషన్‌కు ఆమోదం పలికింది. ఏపీ ఎక్సైజ్ చట్ట సవరణ ముసాయిదా, ఏపీ జీఎస్టీ 2024 చట్ట సవరణ, 2014-18 మధ్య నీరు-చెట్టు పెండింగ్ బిల్లుల చెల్లింపు, పనుల ప్రారంభానికి ఆమోదం తెలిపింది. సీఆర్‌డీఏ పరిధి పెంపు, పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీకి ఆమోదం లభించింది. ఈ నేపథ్యంలో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 1982 ని రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ 2024 బిల్లుకి కేబినెట్ తాజాగా ఆమోదం తెలిపింది. కాగా పాత చట్టంతో భూ అక్రమాణల పై కేసుల నమోదులో ఇబ్బందులు వస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుతం అందుతున్న 80 శాతం ఫిర్యాదులో భూవివాదాలే ఉన్నాయంటున్న ప్రభుత్వం, వైసీపీ హయాంలో లక్షల ఎకరాలు ఆక్రమణలకు గురైనట్లు చెబుతోంది.

Tags:    

Similar News