Breaking: రాజమండ్రి ప్రభుత్వాస్పత్రి వద్ద కేఏపాల్.. ఉద్రిక్తత
రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది...

దిశ, వెబ్ డెస్క్: రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రి(Rajahmundry Government Hospital) వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాస్టర్ ప్రవీణ్ పగడాల(Pastor Praveen Pagadala) మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయింది. అయితే ప్రభుత్వ ఆస్పత్రి వద్దకు ప్రజాశాంతి పార్టీ(Praja Shanti Party) అధ్యక్షుడు, క్రైస్తవ ప్రచారకుడు కేఏపాల్(KAPAL) వెళ్లారు. పోస్టుమార్టం గదిలోకి తనను అనుమతించాలని డిమాండ్ చేశారు. అయితే కేఏపాల్‌ను అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై కేఏపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే దేవుడు క్షమించడని హెచ్చరించారు.
కాగా విజయవాడ(Vijayawada) నుంచి హైదరాబాద్(Hyderabad) వస్తుండగా కొవ్వూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పాస్టర్ ప్రవీణ్ మృతి చెందారు. అయితే ప్రవీణ్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే కేసు నమోదు చేసిన పోలీసులు ప్రవీణ్ మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న క్రైస్తవ సంఘాలు, కేఏపాల్ ఆస్పత్రి వద్దకు వెళ్లారు. ప్రవీణ్ మృతిపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.