Srisailam:మల్లన్న సన్నిధిలో తెలంగాణ మంత్రి
శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి వారిని తెలంగాణ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దిశ ప్రతినిధి,శ్రీశైలం:శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి వారిని తెలంగాణ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న తెలంగాణ మంత్రికి ఈవో పెద్దిరాజు, ఏఈఓ, ఏపిఆర్వో స్వాగతం పలకగా ఆలయ అర్చక స్వాములు మంత్రి నుదుట విభూది తిలకం దిద్ది సాదరంగా ఆహ్వానం పలికారు. అనంతరం మంత్రికి ఆలయ రాజగోపురం వద్ద ఉన్న ద్వజస్థంభానికి నమస్కరించి మల్లికార్జున స్వామి వారికి రుద్రాభిషేకం భ్రమరాంబాదేవి అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీర్వచన మండపంలో ఈవో పెద్దిరాజు స్వామి వారి శేష వస్త్రాలతో సత్కరించగా అర్చకులు వేదపండితులు తీర్ధపస్రాదాలిచ్చి ఆశీర్వదించారు.