Minister Ktr: సీఎం జగన్‌కి గుడ్ లక్ చెప్పిన కేటీఆర్

విశాఖలో ఏపీ గ్లోబల్ సమ్మిట్‌ను ప్రభుత్వం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమ్మిట్ ఈనెల 3,4 తేదీల్ల రెండు రోజులుపాటు జరగనుంది. ..

Update: 2023-03-02 09:50 GMT

దిశ, డైనమిక్ బ్యూరో‌: విశాఖలో ఏపీ గ్లోబల్ సమ్మిట్‌ను ప్రభుత్వం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమ్మిట్ ఈనెల 3,4 తేదీల్ల రెండు రోజులుపాటు జరగనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను నిర్వహిస్తున్న యంగర్ బ్రదర్ వైజాగ్, తోటి రాష్ట్రం ఏపీకి గుడ్ లక్ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. అంతేకాదు రెండు తెలుగు రాష్ట్రాలు దేశంలోనే గొప్ప రాష్ట్రాలుగా వెలుగొందాలని ఈ సందర్భంగా కేటీఆర్ ఆకాంక్షించారు.

ఇకపోతే ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఏపీ పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్‌నాథ్ హైదరాబాద్‌ను ఏపీకి బిగ్ బ్రదర్‌గా అభివర్ణించారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ సైతం అమర్‌నాథ్ బాటలోనే శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌ను బిగ్ బ్రదర్ అని సంబోధిస్తే.. వైజాగ్‌ను కేటీఆర్ యంగర్ బ్రదర్ అని సంబోధించారు. నాడు మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చేసిన వ్యాఖ్యల న్యూస్ పేపర్ క్లిప్‌ను కూడా కేటీఆర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.

Tags:    

Similar News