రేపల్లె ఎక్స్‌ప్రెస్ రైళ్లో సాంకేతిక లోపం.. తీవ్ర భయాందోళనకు గురైన ప్యాసింజర్స్

సికింద్రాబాద్-రేపల్లె ఎక్స్‌ప్రెస్ ట్రెన్‌లో బుధవారం రాత్రి సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో గుంటూరు బైపాస్ వద్ద రైలు నిలిచిపోయింది. ట్రైన్

Update: 2024-05-29 17:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్-రేపల్లె ఎక్స్‌ప్రెస్ ట్రెన్‌లో బుధవారం రాత్రి సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో గుంటూరు బైపాస్ వద్ద రైలు నిలిచిపోయింది. ట్రైన్ నుండి పెద్ద శబ్దంతో పాటు నిప్పురప్పులు రావడంతో తీవ్ర భయాందోళనకు గురైన ప్రయాణికులు వెంటనే చైన్ లాగి రైలును ఆపారు. అనంతరం రైలు నుండి కిందకు దిగి పరుగులు పెట్టారు. టెక్నిల్ ప్రాబ్లమ్ వల్ల గంటకు పైగా రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. రైళ్లులో సాంకేతిక లోపానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


Similar News