వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమిండియా ఓటమి... క్రికెట్ అభిమాని మృతి

వరల్డ్ కప్‌ ఫైనల్‌లో భారత్ ఓటమి ఎంతో మందిని నిరాశపరచిన సంగతి తెలిసిందే.

Update: 2023-11-20 06:22 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : వరల్డ్ కప్‌ ఫైనల్‌లో భారత్ ఓటమి ఎంతో మందిని నిరాశపరచిన సంగతి తెలిసిందే. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఇండియా ఈసారి కప్ కొడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో భారత్ ఓడిపోవడం వారి ఆశలను ఆడియాసలు చేసింది. దీంతో భారతీయులు అంతా నిరాశకు గురైన సంగతి తెలిసిందే. కొంతమంది క్రికెట్ అభిమానులు అయితే భారత్ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా వరల్డ్ కప్ క్రికెట్‌లో భారత్ ఓటమిని జీర్ణించుకోలేక ఓ క్రికెట్ అభిమాని మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే..తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలం దుర్గ సముద్రంకు చెందిన జ్యోతి కుమార్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ను స్నేహితులతో కలిసి చూస్తున్నాడు. అయితే మ్యాచ్ ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఒక్కసారిగా ఆందోళన చెందాడు. ఇంతలో గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇకపోతే జ్యోతి కుమార్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియంలో వరల్డ్ కప్ మ్యాచ్ జరిగింది. ఆసిస్‌తో భారత్ తలపడింది. తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన టీం ఇండియా నిర్ణీత 50 ఓవర్లకు 240 పరుగులకే ఆలౌట్ అయ్యింది. సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా టీం మొదట తడబడినప్పటికీ హెడ్ సెంచరీ (137) , అబూషేన్ హాఫ్ సెంచరీ(58)తో ప్రపంచ కప్ సొంతం చేసుకుంది. 2003లో ఫైనల్స్‌లో తలబడిన టీం ఇండియా మరియు ఆస్ట్రేలియా తిరిగి 20 సంవత్సరాల తరువాత 2023 లో కూడా ఈ రెండు టీంలు ఫైనల్స్‌కి చేరుకున్నాయి. ఆస్ట్రేలియా 2003లో గెలుచుకున్నట్లే 2023లో కూడా భారత్ పై గెలిచి కప్ సొంతం చేసుకుంది.

Tags:    

Similar News