నెలలో విశాఖ వైసీపీ ఖాళీ
నెల రోజుల్లో విశాఖ వైసీపీ ఖాళీ అయిపోతుందని టీడీపీ ఎమ్మెల్యే గణబాబు అన్నారు..
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: మరోనెల రోజుల్లో విశాఖ వైసీపీ ఖాళీ అయిపోతుందని విశాఖ పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. శనివారం సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ పెట్టారు. ‘‘మరో నెల అంతే సగం వైసీపీ విశాఖలో ఖాళీ కానుంది. మా పార్టీకి మీ అవసరం లేదు. మిత్ర పక్షాలు అయిన జనసేన, బిజెపి గూటికి చేరేందుకు క్యు కడుతున్నారు. అధికార దాహం, కనీసం రెండు సంవత్సరాలు కూడా ప్రతిపక్ష పాత్ర వహించలేరు . మిత్ర పక్షాలు జాగ్రత్త వహించాలి, పార్టీ మారిన మాత్రాన మా అధినాయకుడిపై విమానాశ్రయంలో దాడి చేసిన వారిని మేము ఎప్పటికీ క్షమించం’’ అని గణబాబు హెచ్చరించారు.