వైసీపీ ప్రభుత్వానికి త్వరలో ఘోరి కట్టడం ఖాయం : Nara Lokesh
వైసీపీ ప్రభుత్వానికి త్వరలోనే పాడెకడతరాని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హెచ్చరించారు.
దిశ, డైనమిక్ బ్యూరో : వైసీపీ ప్రభుత్వానికి త్వరలోనే పాడెకడతరాని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హెచ్చరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌నను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ మహిళలు, నేతలు ఆందోళనకు దిగుతుంటే వారిపై పోలీసుల దమనకాండ దారుణమని లోకేశ్ అన్నారు. టీడీపీ నేతలపై పోలీసుల దమనకాండను ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వానికి ఘోరి కట్టడం ఖాయమని హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలపై సీఎం జగన్ అణిచివేత వైఖరిని లోకేశ్ తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజలు రోడ్డెక్కితే వైఎస్ జగన్ జడుసుకుంటున్నాడు అని ఘాటుగా విమర్శించారు. అంతేకాదు టీడీపీ నేతలు రోడ్డెక్కి నిరసనలు చేస్తుంటే ఉలిక్కిపడుతున్నాడని చెప్పుకొచ్చారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలోవైసీపీ ప్రభుత్వం ఘోరమైన తప్పిదం చేసిందని అందుకే ప్రశ్నించే గొంతుకలను చూసి భయపడుతుందని చెప్పుకొచ్చారు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ చేస్తున్న ఆందోళన కారులపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు జగన్ పిరికితనానికి నిదర్శనం అని లోకేశ్ హెచ్చరించారు. మరోవైపు తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు నిరసన చేస్తోంటే వారిపై పోలీసుల నిర్బంధం అందర్నీ నిర్ఘాంత పరిచిందని అన్నారు. ప్రభుత్వ వ్యవస్థలో భాగమైన ఆ మహిళలపై అంత కర్కశంగా వ్యవహరించాల్సిన అవసరం ఏంటో అర్ధం కావడం లేదు అని లోకేశ్ అన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు, వ్యతిరేక గళాలు ఉంటాయని ఈ విషయాన్ని వైఎస్ జగన్ తెలుసుకుంటే మంచిదని లోకేశ్ హితవు పలికారు.