పవన్ కల్యాణ్‌తో పోలికా?: సీఎం జగన్‌పై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్‌కు, జగన్‌కు అసలు పోలిక ఉందా అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ...

Update: 2024-04-24 16:55 GMT

దిశ, వెబ్ డెస్క్: పవన్ కల్యాణ్‌కు, జగన్‌కు అసలు పోలిక ఉందా అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో పవన్ కల్యాణ్‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అహంకారి, విధ్వంసకారుడు, దోపిడీదారుడు అని ఘాటు వ్యాఖ్యాలు చేశారు. చెడ్డవాడైన జగన్ ఓడించేందుకు మంచివాళ్లంతా ఒక్కటి కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో నాటకాలడటం జగన్‌కు అలవాటంటూ విజయవాడ ఘటన ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్రా ద్రోహిగా సీఎం జగన్ మిగిలిపోయారని విమర్శించారు. జగన్ హయాంలో ఒక్క పరిశ్రమైనా ఉత్తరాంధ్రకు వచ్చిందా అని ప్రశ్నించారు. పేదలకు చెరువులు, శ్మశానాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చారని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం వచ్చాక ఎవరి ఆదాయమైనా పెరిగిందా అని నిలదీశారు. రాష్ట్రంలో అవినీతి పాలన సాగిందని, అందుకే ప్రజల జీవన ప్రమాణాలు తగ్గాయని వ్యాఖ్యానించారు. అభివృద్ధి చేయడమంటే సంపద సృష్టించి ప్రజలకు పంచడమేనని చంద్రబాబు చెప్పారు. 


Similar News