టార్గెట్ పవన్‌ కల్యాణ్.. ప్రతిపక్షాలను కన్ఫ్యూజ్ చేసేలా జగన్ వ్యూహం?

ఏపీ రాజకీయాలు రోజు రోజుకు ఉత్కంఠ పెంచుతున్నాయి. జగన్ ను గద్దెదించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ ఇతర పార్టీలు జోరు పెంచుతున్నాయి.

Update: 2023-07-15 10:51 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీ రాజకీయాలు రోజు రోజుకు ఉత్కంఠ పెంచుతున్నాయి. జగన్ ను గద్దెదించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ ఇతర పార్టీలు జోరు పెంచుతున్నాయి. ఈ క్రమంలో ప్రతిపక్షాల వ్యూహాలను చిత్తుచేసి మరోసారి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు వైసీపీ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగా తన వ్యూహం మార్చిందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతి సారీ టీడీపీని ఏకీపారేసే వైసీపీ తాజాగా జనసేన టార్గెట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర మొదలైన అప్పటి నుంచి జనసేన, వైసీపీ నాయకులు తీవ్ర విమర్శలు ఒకరిపై ఒకరు చేసుకోవడం మొదలైంది. ముఖ్యంగా ప్రతి సారీ పవన్‌కల్యాణ్ వ్యక్తిగత విషయం అయిన పెళ్లిలపై, ప్యాకేజీ స్టార్ అంటూ వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తుంటారు. దానికి పవన్ కల్యాణ్ కూడా కౌంటర్లు ఇస్తుంటారు. వారాహి యాత్రలో పవన్ ప్రభుత్వంపై పలు రకాలుగా ఆరోపణలు చేస్తున్నారు. దానికి వైసీపీ గట్టి కౌంటర్లు ఇస్తూనే ఉంది. తాజాగా జనసేన అధినేత వాలంటీర్ల వ్యవస్థపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దీనిపై వాలంటీర్లు కూడా నిరసనలు చేపట్టారు. పవన్‌పై పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదు చేశారు.

టీడీపీ కంటే జనసేనపైనే ఫోకస్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని విమర్శించే వైసీపీ రూటు మార్చినట్లు కనిపిస్తుంది. టీడీపీ కంటే కూడా జనసేనపైనే ఫోకస్ చేసినట్లు కనిపిస్తోంది. మరోవైపు టీడీపీ అగ్రనాయకుడు లోకేష్ కూడా యువగళం పేరుతో యాత్రలు చేస్తూ.. వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న కూడా వైసీపీ దృష్టి మాత్రం పవన్ కల్యాణ్ నే టార్గెట్ చేస్తుంది. ఇది ఒక వ్యూహ రచనలో భాగంగానే టీడీపీపై కాకుండా జనసేన పై ఫోకస్ పెంచారు. ముందస్తుకు వెళ్లే అలోచనల ఉన్న వైసీపీ ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే టీడీపీని బలంగా చూపించకుండా జనసేనపై ఫోకస్ పెట్టినట్లు ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నంగా పొలిటికల్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. టీడీపీని రాష్ట్రంలో బలహీన పరిచే విధంగా చేసే ప్రయత్నాలు గా కనిపిస్తోంది. ప్రతిపక్షాలను కన్ఫ్యూజ్ చేసి మరోసారి వైసీపీ గద్దెనెక్క ప్రయత్నం చేస్తున్నది. ఈ నేపథ్యంలో జనసేన చేసే తప్పులను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీని మాత్రం ఈ మధ్య డైరెక్ట్‌గా ఏకిపారేయడం తగ్గించినట్లు తెలుస్తొంది. ప్రజల దృష్టిని టీడీపీపై కాకుండా వైసీపీపై తిప్పుకునే ప్రయత్నంలో భాగమే జనసేనపై ఫోకస్ చేస్తున్నారు.

వాలంటీర్ల ఓట్లు రాబట్టుకునే కోణమా?

ఇటీవల జనసేన అధినేత రెండో విడత వారాహి విజయయాత్రలో భాగంగా ఏలూరులో నిర్వహించిన బహిరంగ సభలో వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం చెలరేగింది. వాలంటీర్లు నిరసనలు, ధర్నాలు పవన్‌పై కేసులు కూడా నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆయన చేసిన వ్యాఖ్యలను రాష్ట్రంలోని ప్రజా సంఘాలు, సామాజికవేత్తలు పలు వర్గాలు కూడా ఖండించించాయి. వాలంటీర్లు ప్రభుత్వం పై గుర్రుగా ఉన్న సమయంలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను వైసీసీ తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్న వైసీపీ సర్కార్ లక్షల్లో ఉండే వాలంటీర్లు, వారి కుటుంబ సభ్యుల ఓట్లను వైసీపీకే వేసేట్లుగా ప్లాన్‌ చేశారనే టాక్ వినిపిస్తుంది. అందుకే పవన్ కల్యాణ్ పై ఈ మధ్య విపరీతంగా వైసీపీ నేతలు చిందులు వేస్తున్నట్లు కనిపిస్తుంది.

Tags:    

Similar News