తిరుమలలో అనుమానాస్పదంగా ఉద్యోగి.. బ్యాగ్ చెక్ చేసిన పోలీసులు షాక్
తిరుమల కొండపై అనుమానాస్పదంగా కనిపించిన ఉద్యోగి బ్యాగ్ చెక్ చేసిన పోలీసులు షాక్ అయ్యారు.
దిశ, వెబ్‌డెస్క్: తిరుమల కొండపై అనుమానాస్పదంగా కనిపించిన ఉద్యోగి బ్యాగ్ చెక్ చేసిన పోలీసులు షాక్ అయ్యారు. గంజాయి రవాణా విషయంలో ఏపీ సర్కార్ కఠిన ఆదేశాలు జారీ చేస్తున్న పెడ్లర్లు మాత్రం తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. తాజాగా తిరుమలలోనే గంజాయి పట్టుబడటం సంచలనం రేపింది. తిరుమలకు గంజాయి తరలిస్తున్న టీటీడీ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయ్ ను స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు.
తిరుపతికి చెందిన గంగాద్రి అనే వ్యక్తి తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్ లో లగేజీ కౌంటర్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. అలిపిరి వద్ద అనుమానాస్పదంగా కనిపించిన ఉద్యోగి బ్యాగ్ చెక్ చేసిన ఎస్ ఈబీ అధికారులు బ్యాగులో గంజాయిని గుర్తించారు. 15 ప్యాకెట్లలో నింపిన 150 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సీసీ టీవీ ఫుటేజీలో నిందితుడు గంజాయిని ప్లాస్టిక్ కవర్ లో చిన్న ప్యాకెట్లుగా ఉంచి వాటిని కాలికి కట్టుకుని తిరుమలకు వచ్చినట్లు తేలింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.