Supreme Court: తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు రద్దు

మాజీ మంత్రి వైఎస్ వివేకాహత్య కేసులో సునీత పిటిషన్ పై సుప్రీంకోర్టులో వాదనలను ముగిశాయి....

Update: 2023-04-24 10:16 GMT

దిశ, వెబ్ డెస్క్: వైఎస్ వివేకా హత్య కేసులో గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఇప్పుడు జరుగుతున్న దర్యాప్తు ప్రక్రియను జూన్ 30వ తేదీకల్లా పూర్తిచేయాలని సీబీఐని ఆదేశించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాశ్‌రెడ్డికి లిఖితపూర్వకంగా ప్రశ్నలు ఇవ్వాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాన్నీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తప్పుపట్టింది. వైఎస్ వివేకా కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై సీజే ధర్మాసనం సుమారు గంటన్నరకుపైగా సోమవారం విచారణ జరిపింది. సునీత, సీబీఐ, అవినాశ్ తరఫన తీవ్ర స్థాయిలో వాదనలు జరిగాయి. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం కొట్టేయడంతో అరెస్టు చేయకుండా సీబీఐకి స్పష్టమైన ఆదేశాలు జారీచేయాల్సిందిగా అవినాశ్ తరఫు న్యాయవాది చేసిన విజ్ఞప్తికి చుక్కుదురైంది.

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ తన దర్యాప్తును ఏప్రిల్ 30వ తేదీకల్లా పూర్తిచేయాలంటూ గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. కానీ జాప్యం జరగడంతో దాన్ని జూన్ 30కల్లా పూర్తి చేయాలని తాజాగా ధర్మాసనం స్పష్టత ఇచ్చింది. అవినాశ్ తన ముందస్తు బెయిల్ పిటిషన్‌ వ్యవహారాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. అప్పటివరకూ సీబీఐ తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని సీజే ధర్మాసనానికి ఆయన తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. విచారణ పేరుతో తనను అరెస్టు చేసే అవకాశముందని, హౌజ్ అరెస్టు చేసే ఛాన్స్ ఉందని లాయర్ వ్యాఖ్యానించారు. దీనిపై ఘాటుగానే స్పందించిన సీజే బెంచ్... సీబీఐ అరెస్టు చేస్తుందని భావిస్తున్నారా?.. హౌజ్ అరెస్టు చేస్తుందని ఎందుకు ఊహించుకుంటున్నారు అని ఎదురు ప్రశ్నించారు.

సీబీఐ పూర్తి సంయమనంతో ఉన్నదని, ఒకవేళ అరెస్టు చేయాలని భావించినట్లయితే ఎప్పుడో ఆ పని చేసి ఉండేదని వ్యాఖ్యానించింది.రు.

 Also Read..

YS Viveka Case : నేడు సునీతారెడ్డి పిటిషన్‌పై విచారణ.. తీవ్ర ఉత్కంఠ

Tags:    

Similar News