Supreme Court: సుప్రీం కోర్టులో చంద్రబాబుకు భారీ ఊరట.. ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి (CM Chandrababu Naidu)కి దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు (Supreme Court)లో భారీ ఊరట లభించింది.

Update: 2025-01-28 07:10 GMT
Supreme Court: సుప్రీం కోర్టులో చంద్రబాబుకు భారీ ఊరట.. ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి (CM Chandrababu Naidu)కి దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు (Supreme Court)లో భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన సీఐడీ (CID) కేసులను వెంటనే సీబీఐ (CBI)కి బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్లను కొట్టి వేసింది. విచారణ సందర్భంగా పిటిషనర్ బాలయ్య (Balaiah) తరఫు న్యాయవాది మణీంద్ర సింగ్‌ (Manindra Singh)పై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదొక పనికిమాలిన పిటిషన్ అని, దీనిపై మరొక్క మాట మాట్లాడినా.. భారీ జరిమానా విధిస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఇలాంటి కేసుల్లో మీ లాంటి సీనియర్లు హాజరు అవుతారని అసలు ఊహించలేదని, కేసును వాదించడానికి ఎలా కోర్టుకు వచ్చారని మణీంద్ర సింగ్‌ (Manindra Singh)పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.  

కాగా, వైఎస్ జగన్ (YS Jagan) సీఎంగా ఉన్న సమయంలో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ (AP Skill Development), అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (Amaravati Inner Ring Road) సహా మొత్తం సీఐడీ (CID) ఏడు కేసులను నమోదు చేసింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ (YCP) ఘోర పరాజయాన్ని చవిచూసింది. తిరిగి చంద్రబాబు (Chandrababu) ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సీఎంగా ఉన్న చంద్రబాబు కేసులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున ఆయనపై నమోదైన కేసుల్లో సీఐడీకి బదులుగా సీబీఐకి బదిలీ చేయాలని న్యాయవాది బాలయ్య (Balaiah) సుప్రీం కోర్టు (Supreme Court)లో పిటిషన్ దాఖలు చేశారు. బాలయ్య తరపున సుప్రీం కోర్టు సీనియర్ కౌన్సిల్ మణీంద్ర సింగ్ వాదనలకు దిగగా.. అత్యున్నత న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది. 

Tags:    

Similar News