Supreme Court: చంద్రబాబు కేసు విచారణ వాయిదా.. 17(ఏ)పై జడ్జి కీలక వ్యాఖ్యలు
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది...
దిశ, వెబ్ డెస్క్: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. చంద్రబాబు తరపున ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. 17ఏ చంద్రబాబుకు కచ్చితంగా వర్తిస్తుందని చంద్రబాబు తరపున హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. ఈ కేసు రాజకీయ కక్ష సాధింపు చర్యేనని కోర్టుకు సాల్వే వివరించారు. 2021 సెప్టెంబర్ 17న ఫిర్యాదు దాఖలైందని సాల్వే తెలిపారు. అయితే విచారణ సందర్భంగా జస్టిస్ బేలా త్రివేది కీలక వ్యాఖ్యలు చేశారు. 17(A)అనేది అవినీతి నిరోధానికి ఉండాలని.. కానీ కాపాడేందుకు కాదని బేలా త్రివేది పేర్కొన్నారు. ఇదే కధా 17-ఏ చట్టం అసలు ఉద్దేశమన్నారు. 17ఏలో చాలా అంశాలున్నాయని తెలిపారు. 17ఏకు ముందు జరిగిన నేరాలకు ఇది వర్తిస్తుందా అని ప్రశ్నించారు. 17ఏ ప్రకారం అనుమతి తీసుకోకపోతే జరిగిన దర్యాప్తు ఏం కావాలని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ బేలా త్రివేది ప్రశ్నించారు. మరోవైపు సీఐడీ తరఫున వాదనలు మంగళవారం వినిపించనున్నారు.