ఆరేళ్లుగా న్యాయం జరగేలేదు: వైఎస్ సునీత తీవ్ర ఆవేదన

తన తండ్రి వివేకానందారెడ్డి హత్య జరిగి ఆరేళ్లు అయినా న్యాయం జరగలేదని ఆయన కుమార్తె సునీత అన్నారు..

Update: 2025-03-15 09:18 GMT

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందారెడ్డి(YS Vivekananda Reddy) హత్య జరిగి ఆరేళ్లు పూర్తి అయింది. అయితే ఆయన హత్య కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది. దీంతో వివేకా కుమార్తె వైఎస్ సునీత(YS Sunitha) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి చనిపోయి ఆరేళ్లు అయినా ఇంకా న్యాయం జరలేదని ఆమె వాపోయారు. శనివారం సాయంత్రం గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలవనున్నట్లు ఆమె తెలిపారు. వివేకా హత్య కేసు సాక్షుల వరుస మృతిని గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లనున్నారు. సీబీఐ విచారణ ముమ్మరం చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరనున్నారు. అటు సాక్షుల మరణాలపై ప్రత్యేకమైన కమిటీ వేసి విచారణ చేపట్టాలని గవర్నర్‌ను సునీత విజ్ఞప్తి చేశారు. వివేకానందారెడ్డి హత్య కేసు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఒక నిందితుడు తప్ప మిగిలిన అందరూ జైలు బయటే ఉన్నారని చెప్పారు. ఇప్పటికైనా వైఎస్ వివేకానందారెడ్డి మరణానికి న్యాయం జరగాలన్నారు. సీబీఐ ట్రాయల్స్ కూడా ఇంకా ప్రారంభం కాలేదని సునీత వ్యాఖ్యానించారు. వివేకా హత్య కేసులో మిగిలిన సాక్షులను కాపాడుకోవాలని వైఎస్ సునీత పేర్కొన్నారు. 

Tags:    

Similar News