టెన్త్‌లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు లక్ష రూపాయలు అందిస్తాం: మంత్రి బొత్స

ఈ ఏడాది పదవ తరగతి ఫలితాల్లో తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా రెండవ స్థానంలో నిలిచింది.

Update: 2023-05-17 11:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది పదవ తరగతి ఫలితాల్లో తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా రెండవ స్థానంలో నిలిచింది. దీంతో మంత్రి హారీష్ రావు 10/10 జీపీఏ సాధించిన సర్కారు పాఠశాల విద్యార్థులకు రూ.10,000 నగదు బహుమతి అందించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా.. ఏపీ ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో చదివే విద్యార్థులు నియోజకవర్గ స్థాయిలో టాప్ 3లో ఉన్న వారికి ఈ నెల (మే )23న పతకం, సర్టిఫికేట్‌తో సన్మానిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

అలాగే జిల్లా స్థాయిలో టాప్ -3లో మంచి మార్కులు స్కోర్ చేసిన విద్యార్థులకు ఈ నెల 27వ తేదీన రూ. 50వేలు, రూ.30వేలు, రూ. 10వేలు అందిస్తామని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో టాప్ 3లో నిలిచిన విద్యార్థులకు రూ. 1 లక్ష, రూ. 75వేలు, రూ.50 వేలు నగదు బహుమతి ఇస్తామని వెల్లడించారు.

Also Read..

CPI: సీఎం జగన్ కుంభకోణం రూ.100 కోట్లు

Tags:    

Similar News