అవయవాలపై వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తప్పవు: మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్

అవయవదానం చేయడానికి ప్రజలు ముందుకు రావాలని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి(AP Medical Health Minister) సత్యకుమార్(Satya Kumar Yadav) పిలుపునిచ్చారు.

Update: 2025-01-03 09:06 GMT

దిశ,వెబ్‌డెస్క్: అవయవదానం చేయడానికి ప్రజలు ముందుకు రావాలని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి(AP Medical Health Minister) సత్యకుమార్(Satya Kumar Yadav) పిలుపునిచ్చారు. ఇవాళ(శుక్రవారం) అవయవదానంపై గుంటూరు(Guntur) మెడికల్ కాలేజీ(Medical College)లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్య కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవయవదానంపై ప్రజల్లో అవగాహన తీసుకురావడం అభినందనీయమని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో(Government Hospital) రోజుకు ఐదు బ్రెయిన్ డెడ్ కేసులు వస్తున్నాయని తెలిపారు. ఈ క్రమంలో పేదలను మభ్యపెట్టి అవయవాలు తీసుకునే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవయవాలపై వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి సత్య కుమార్ యాదవ్ హెచ్చరించారు.


Similar News