Steel Workers:తక్షణమే వేతనాలు చెల్లించాలని ఉక్కు ఉద్యోగుల ధర్నా
ఉక్కు కర్మాగారంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు తక్షణమే వేతనాలు చెల్లించాలని ఉక్కు యువ ఉద్యోగులు డిమాండ్ చేశారు.
దిశ,ఉక్కు నగరం:ఉక్కు కర్మాగారంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు తక్షణమే వేతనాలు చెల్లించాలని ఉక్కు యువ ఉద్యోగులు డిమాండ్ చేశారు. గురువారం ఉదయం ఉక్కు అడ్మిన్ బిల్డింగ్ వద్ద ఉద్యోగులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి యూనియన్ ఆఫ్ స్టీల్ ఎంప్లాయీస్ ప్రధాన కార్యదర్శి కె.పరంధామయ్య మాట్లాడుతూ గత ఆరు మాసాలుగా ఉద్యోగులకు వేతనాలు సకాలంలో చెల్లించడం లేదన్నారు. ఆలస్యంగా రెండు విడతలుగా వేతనాలు చెల్లిస్తున్నారని అన్నారు. సకాలంలో వేతనాలు చెల్లించక పోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారని అన్నారు. ఉక్కు యువ ఉద్యోగులు వేతనాలు చెల్లించాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఇంకా ఈ ప్రదర్శనలో యువ ఉద్యోగులు కోరాడ వెంకట రమణ, ధర్మాల కనక రెడ్డి, గవర అచ్చి బాబు, అట్టా అప్పారావు పాల్గొన్నారు.