వైఎస్ఆర్‌నగర్‌లో భూ కబ్జా.. సొంత పార్టీ నేతలపై ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆగ్రహం
అధికార పార్టీ పేరు చెప్పి దౌర్జన్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు. వైఎస్ఆర్ నగర్‌లో భూ కబ్జాదారుల ఆగడాలపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గురువారం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు..
దిశ, డైనమిక్ బ్యూరో: అధికార పార్టీ పేరు చెప్పి దౌర్జన్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు. వైఎస్ఆర్ నగర్‌లో భూ కబ్జాదారుల ఆగడాలపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గురువారం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగ పట్టాలు తయారు చేసేవారిని.. దౌర్జన్యాలు చేసేవారిని ఏ పార్టీలో ఉన్నా సహించవద్దని, వారిపై నాన్ బెయిలబుల్ కేసులను నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పోలీస్, రెవెన్యూ, హౌసింగ్, విద్యుత్ శాఖ అధికారులతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమావేశం అయ్యారు. వైఎస్ఆర్ నగర్‌లో పేదలకు ఎటువంటి అన్యాయం జరిగినా ఉపేక్షించేలేదన్నారు. వైఎస్ఆర్ నగర్‌లో భూ కబ్జాలకు పాల్పడుతూ దౌర్జన్యాలకు పాల్పడుతున్న కొంతమందిని ఇప్పటికే గుర్తించామని వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా లొంగొదని సూచించారు. ఈ సమావేశంలో నెల్లూరు తహసీల్దార్ వెంకటేశ్వర్లు, డిప్యూటీ తహసీల్దార్ నాజర్, సీఐ నరసింహారావుతో సహా పలువురు విద్యుత్తు హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు.