Ycp Mla Anam మరోసారి సంచలన వ్యాఖ్యలు
మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. డక్కిలిలో సచివాలయ కన్వీనర్లు, వలంటీర్స్ సమావేశం నిర్వహించారు...
- వచ్చే ఎన్నికల కోసం నా సీటుకు ఎసరుపెడుతున్నారు
- 2024 వరకు నేనే ఎమ్మెల్యేని
దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. డక్కిలిలో సచివాలయ కన్వీనర్లు, వలంటీర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆనంతోపాటు వెంకటగిరి పరిశీలకుడు సత్యనారాయణ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డిపై ఆనం రామనారాయణరెడ్డి పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మల్యే తానా?.. కొత్తవారా? అని పరిశీలకుడు సత్యనారాయణరెడ్డిని ఆనం నిలదీశారు. వెంకటగిరి ప్రజలు తనను ఎమ్మెల్యేగా ఎన్నుకొన్నారని ఆయన చెప్పారు. ఇప్పటివరకు తానే ఎమ్మెల్యేనని పేర్కొన్నారు. ఇంకా సంవత్సరం రోజులు తానే ఎమ్మెల్యేనని స్పష్టం చేశారు. 'వెంకటగిరిలో సంవత్సరం తరువాత వచ్చే పెద్ద మనిషి ఇప్పుడే ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్నట్లున్నారు. ఆయనొచ్చి నేనే రేపు ఎమ్మెల్యేని, రేపు రాబోతున్నాను అని అంటున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేని నేను అవునా ? కాదా?.' అని పరిశీలకుడికి ఆనం ప్రశ్నల వర్షం కురిపించారు. 'కొంతమంది ఆశపడుతుంటారు. ఆనం ఎప్పుడు ఖాళీ చేస్తాడా ?, కుర్చీ లాక్కుందామా అని. సంవత్సరం తరువాత వచ్చే ఎన్నికలకు ఇప్పుడే ఎసరు పెడుతున్నారు.' అని ఆనం వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు మరోసారి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తు్న్నాయి.