నెల్లూరులో వైసీపీకి భారీ షాక్.. టీడీపీలో చేరిన ముగ్గురు కీలక నేతలు

నెల్లూరులో వైసీపీకి భారీ షాక్ తలిగింది. ముగ్గురు కీలక నేతలు కండువా మార్చారు...

Update: 2024-03-02 08:33 GMT

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరులో వైసీపీకి భారీ షాక్ తలిగింది. ముగ్గురు కీలక నేతలు కండువా మార్చారు. టీడీపీ అధినేత సమక్షంలో సైకిల్ గూటికి చేరారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు కొంతకాలంగా వైసీపీకి దూరంగా ఉంటున్నారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు సీటు ఇతరులకు కేటాయించడంతో వారు అసంతృప్తిగా ఉన్నారు. ఈ విషయం తెలిసినా సీఎం జగన్ మాత్రం ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో ఆయనతో పాటు భార్య కూడా వైసీపీకి గుడ్ బై చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో శనివారం నెల్లూరులోనే  తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరితో పాటు నెల్లూరు డిప్యూటీ మేయర్, మాజీ మంత్రి అనిల్ కుమార్ బాబాయ్ రూమ్ కుమార్ కూడా సైకిల్ ఎక్కారు. చంద్రబాబు సమక్షంలో ఆయన సైతం తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకున్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును సీఎం  చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తామని తెలిపారు.

Read More..

తాగేందుకు నీళ్లు అడిగితే చంపేస్తారా? ఎస్సీలను చంపీ డోర్ డెలివరీ చేస్తున్నారు.. పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు  


Similar News