దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుపై నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశార. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ము చంద్రబాబుకు లేదని ఎద్దేవా చేశారు. గెలిచే దమ్ము లేక పొత్తులు పెట్టుకుని ఎన్నికలకు వస్తున్నారని విమర్శించారు. చీకటి ముసిరినట్టు ఆశలు అడుగంటడంతో పొత్తులు పెట్టుకుని కూటమి అనే పేరుతో పోటీకి దిగుతున్నారన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలుగా నిలబెట్టే అభ్యర్థులకు ప్రజాభిమానం కొలబద్ద కాదట అని వ్యాఖ్యానించారు. రూ. 200 కోట్లు వెదజల్లే స్థోమత ఉన్న వారికే ఎంపీ టికెట్, వంద కోట్లు పెట్టేవారికి ఎమ్మెల్యే సీటిచ్చి ప్రజాస్వామ్యం, పాలకూర కట్ట అంటూ సోది చెబుతున్నారని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ప్రజాభిమానం ఉంటే పొత్తులు ఎందుకు.. డబ్బు సంచులు ఎందుకు చంద్రబాబు గారూ! అంటూ ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. పేదలకు సేవ చేయాలన్న మహాత్మా గాంధీ స్ఫూర్తితో అన్ని వర్గాల పేదలకు మేలు చేశామని చెప్పారు. ఒకటికి నాలుగుసార్లు ఆలోచించి మంచి చేసిన వారికే ఓటేయండని విజయసాయిరెడ్డి కోరారు.
గెలిచే దమ్ము ఉంటే చంద్రబాబు గారు ఒంటరిగా పోటీ చేసేవారే. చీకటి ముసిరినట్టు ఆశలు అడుగంటడంతో పొత్తులు పెట్టుకుని కూటమి అనే పేరుతో పోటీకి దిగుతున్నారు. ఆయన ఎమ్మెల్యేలు, ఎంపీలుగా నిలబెట్టే అభ్యర్థులకు ప్రజాభిమానం కొలబద్ద కాదట! రెండొందల కోట్లు వెదజల్లే స్థోమత ఉన్న వారికే ఎంపీ టికెట్,…
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 1, 2024