Ap News: ఫోన్ ట్యాపింగ్‌పై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఏపీలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీరెడ్డి అన్నారు...
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీరెడ్డి అన్నారు. ఏడాది క్రితమే ఈ వ్యవహారాన్ని తాను బయటపెట్టానని ఆయన తెలిపారు. నెల్లూరులో ఆదివారం ఉదయం మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ నేతల ఫోన్ల ట్యాపింగ్‌పై విచారణ చేయిస్తామని కోటంరెడ్డి హెచ్చరించారు. సోషల్ మీడియోలో వైఎస్ షర్మిల, సునీతపై సోషల్ మీడియాలో వ్యక్తి విమర్శలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇతర పార్టీల నాయకులను సోషల్ మీడియాలో వైసీపీ వేధిస్తోందని మండిపడ్డారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరుతున్న నేతలను ఎమ్మెల్యే ప్రసన్న కుమార్‌రెడ్డి బెదిరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఓటమి భయంతో అలా చేస్తున్నారంటూ విమర్శించారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదని, ఇక ముందు తామే సమాధానం చెబుతామని కోటంరెడ్డి హెచ్చరించారు.
కాగా తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇంటెలిజెన్స్ అధికారి రామాంజనేయులు నేతృత్వంలోనే ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. దీంతో ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు.