రోడ్డు దాటుతుండగా కారు ఢీకొంది..

తిరుపతి జిల్లా నాయుడుపేట-పూతలపట్టు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.

Update: 2025-02-07 06:54 GMT
రోడ్డు దాటుతుండగా కారు ఢీకొంది..
  • whatsapp icon

దిశ, సూళ్లూరుపేట : తిరుపతి జిల్లా నాయుడుపేట-పూతలపట్టు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. వివరాల మేరకు.. పెళ్లకూరు మండలం రావులపాడుకు చెందిన మందం వెంకటరత్నం ఇవాళ ఉదయం టెంకాయ తోపు గ్రామం వద్ద రోడ్డు దాటుతుండగా మహేంద్ర స్కార్పియో కారు ఢీకొట్టింది. దీంతో వెంకటరత్నం అక్కడికక్కడే మృతిచెందాడు. నిరుపేద కుటుంబానికి చెందిన యజమాని చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రమాద స్థలానికి నాయుడుపేట రూరల్ సీఐ సంగమేశ్వర రావు చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Tags:    

Similar News