నెల్లూరులో కాకరేపుతున్న రాజకీయాలు... ఎంపీ వేమిరెడ్డితో నారాయణ భేటీ

నెల్లూరులో రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బుధవారం వైసీపీకి రాజీనామా చేశారు..

Update: 2024-02-22 11:31 GMT

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరులో రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బుధవారం వైసీపీకి రాజీనామా చేశారు. ఆయనతో పాటు భార్య సైతం ఫ్యాన్ పార్టీ నుంచి తప్పుకోవడంతో టీడీపీ నేతలు టచ్ లోకి వెళ్లారు. బుధవారం సాయంత్రం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కలిశారు. టీడీపీలోకి రావాలని ఆహ్వానించారు. అటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలోకి రావాలని కోరారు. తాజాగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని మాజీ మంత్రి, నెల్లూరు సిటీ టీడీపీ నేత నారాయణతో పాటు సోమిరెడ్డి సైతం కలిశారు. టీడీపీలోకి రావాలని ఆహ్వానించారు. తెలుగు దేశం పార్టీలో చేరితే సరైన గుర్తింపు ఇస్తామని, ప్రతిపాదనలు ఏమైనా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని వేమిరెడ్డికి భరోసా ఇచ్చారు. ప్రస్తుతం వీరి భేటీ కొనసాగుతోంది. భేటీ అనంతరం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్పందిస్తారేమో చూడాలి.


Read More..

Breaking: మంత్రి ధర్మానపై ఈసీకి ఫిర్యాదు

Tags:    

Similar News