ఆయన సైగ చేస్తే కొడాలి నాని అంతు చూస్తాం: కోటంరెడ్డి
లారీ క్లీనర్‌గా పనిచేసుకుంటున్న కొడాలి నానికి తెలుగుదేశం ప్రభుత్వం రాజకీయ బిక్ష పెట్టిందని టీడీపీ నెల్లూరు సిటీ ఇంఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్నారు...
దిశ,నెల్లూరు: లారీ క్లీనర్‌గా పనిచేసుకుంటున్న కొడాలి నానికి తెలుగుదేశం ప్రభుత్వం రాజకీయ బిక్ష పెట్టిందని టీడీపీ నెల్లూరు సిటీ ఇంఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్నారు. ఆ విశ్వాసం కూడా నానికి లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నానిపై కోటంరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నాని చేసిన వ్యాఖ్యలను సుమోటాగా తీసుకుని అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని కోటంరెడ్డి డిమాండ్ చేశారు..
చంద్రబాబు, లోకేష్‌పై కొడాలి నాని పిచ్చి పట్టిన కుక్కలాగా వాగుతున్నాడని కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మండిపడ్డారు.. కొట్టుకోవడానికి నల్లమల అడవుల్లో ఎందుకని.. కొడాలి నానికి దమ్ముంటే విజయవాడ బెంజి సర్కిల్‌కు రావాలని సవాల్ విసిరారు. చంద్రబాబు సైగ చేస్తే.. కొడాలి నాని అంతు చూస్తామని కోటంరెడ్డి హెచ్చరించారు. వైఎస్ వివేకా కేసులో సీఎం జగన్ ఫ్యామిలీకి చుట్టుకోవడంతో దాన్ని డైవర్ల్ చేసేందుకు చంద్రబాబుపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడని మండిపడ్డారు. అబ్బాయి కిల్డ్ బాబాయ్ అనేది అందరికీ తెలిసిన విషయమేనన్నారు. జగన్ త్వరలోనే జైలుకు వెళ్లబోతున్నాడని కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి జోస్యం చెప్పారు..