Nellore: నా భార్యను నాకు అప్పగించండి.. భర్త ఆవేదన

తన భార్యను వైసీపీ నేతల ఒత్తిళ్లతో పోలీసులు ఆమె తల్లిదండ్రులకు బలవంతంగా అప్పగించారని తిరకాల శేషసాయి అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు..

Update: 2023-04-17 15:19 GMT

దిశ, నెల్లూరు: తన భార్యను వైసీపీ నేతల ఒత్తిళ్లతో పోలీసులు తల్లిదండ్రులకు బలవంతంగా అప్పగించారని నెల్లూరు రూరల్ మండలం కాకుపల్లికి చెందిన తిరకాల శేషసాయి అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్యను తనకు అప్పగించేలా జిల్లా ఎస్పీ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నెల్లూరులోని ప్రెస్ క్లబ్‌లో సోమవారం శేషసాయి విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. పొదలకూరు మండలం మర్రెపల్లి గ్రామానికి చెందిన శివప్రియ తానూ గత 8 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నామని, అమ్మాయి తరపు తల్లిదండ్రులు తమ వివాహానికి ఒప్పుకోకపోవడంతో గత నెల 17న తామిద్దరం కేరళకు వెళ్లి వివాహం చేసుకున్పామని తెలిపారు.

అయితే శివప్రియను తాను కిడ్నాప్ చేశానని వారి తల్లిదండ్రులు రెండు దఫాలు తనపై పోలీసులకు ఫిర్యాదు చేశారని శేషసాయి తెలిపారు. పోలీసుల ఎదుటే శివప్రియ తనను ఇష్టపూర్వకంగా వివాహం చేసుకున్నట్లు వెల్లడించిందని పేర్కొన్నారు. తాజాగా పొదలకూరు పోలీసులకు మళ్లీ ఫిర్యాదు చేశారన్నారు. పొదలకూరు పోలీసులు తమను పిలిపించి తనపై కేసు నమోదు చేసి శివప్రియను బలవంతంగా వారి కుటుంబసభ్యులతో పంపించి వేశారన్నారు. కొందరు వైసీపీ నేతల ఒత్తిళ్లతోనే తమను విడతీశారని, తన భార్యను తనకు అప్పగించాలని శేషసాయి జిల్లా ఎస్పీకి విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News