మ్యాన్ హోల్ నుంచి మెషిన్ హోల్ దిశగా నెల్లూరు
నెల్లూరు నగరం మ్యాన్ హోల్ నుంచి మిషన్ హోల్ దిశగా పురోగతి సాధించిందని ప్రధాని మోదీకి నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ హరిత వివరించారు...
దిశ, నెల్లూరు: నెల్లూరు నగరం మ్యాన్ హోల్ నుంచి మిషన్ హోల్ దిశగా పురోగతి సాధించిందని ప్రధాని మోదీకి నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ హరిత వివరించారు. ప్రధాని మోదీతో వెబినార్‌లో పాల్గొనే అవకాశం నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ హరితకు లభించింది. ప్రధాని మోదీ పోస్ట్ బడ్జెట్ వెబినార్-2023 సమావేశం నిర్వహించారు. 100% మెకానికల్ డీ స్లెడ్జింగ్ ఆఫ్ సెప్టిక్ ట్యాంక్ అమలు చేయడంలో నెల్లూరు నగరపాలక సంస్థ దేశంలోనే అగ్రగామిగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ నిర్వహించిన వెబినార్‌లో కమిషనర్ హరిత పాల్గొని సఫారీ మిత్ర కార్మికుల కోసం చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించారు.
నెల్లూరులో మాన్యువల్ స్కావెంజింగ్‌ను నిషేధించామని, 14420 కాల్ సెంటర్ – హెల్ప్ లైన్ ద్వారా సఫాయి మిత్ర ఉద్యమ యోజన స్కీం ద్వారా డీస్లెడ్జింగ్ మెషిన్ కొనిచ్చామని తెలిపారు. నెల్లూరు నగర పాలక సంస్థ వారికి ఉపాధి భద్రత ఇచ్చి, ప్రతి నెల ఆయా కార్మికులకు రూ.10 వేల వరకు ఆదాయం వచ్చే విధంగా జీవనోపాధి కల్పించామని వివరించారు. కాల్ సెంటర్‌కు వచ్చే ప్రతి కాల్‌ను రొటేషన్ పద్ధతిలో ఆపరేటర్స్‌కు కేటాయించడం జరుగుతోందని ప్రధాని మోదీకి కమిషనర్ హరిత వివరించారు.
డీస్లెడ్జింగ్ ఆపరేటర్స్‌కు ఎఫ్‌ఎస్‌టీపీ హరనాధపురంలో వినియోగంలో ఉన్నదని, అందులో పని చేసే వారికి పీపీఈ కిట్లు, సేఫ్టీ గేర్ ఐటమ్స్ ఇచ్చి శిక్షణ ఇచ్చామని పేర్కొన్నారు. ఈ వెబ్ సెమినార్‌లో పాల్గొన్న సఫాయి మిత్రా కార్మికుడు టి. రవికుమార్ తాను చేసే పని విధానాన్ని వివరించారు.