కావలిలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి మాకు సంబంధం లేదు: MLA Ramireddy Pratap
కావలిలో ఆర్టీసీ డ్రైవర్ పై దాడి ఘటన దురదృష్టకరమని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ అన్నారు..
దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా కావలి మండలం మద్దూరుపాడు జాతీయ రోడ్డుపై హారన్ కొట్టారని ఆర్టీసీ బస్సు డ్రైవర్ బీఆర్ సింగ్‌పై వైసీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోయి దాడి చేశారు. అయితే ఈ దాడి చేసింది వైసీపీ నాయకులని సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ ఘటనపై ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కావలి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ స్పందించారు. కావలిలో ఆర్టీసీ డ్రైవర్ పై దాడి ఘటన దురదృష్టకరమన్నారు. అయితు ఎవరో దాడికి పాల్పడితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉన్నట్లు నారా లోకేశ్ చిత్రీకరించడం తగదన్నారు. ఇలాంటి దాడులను తమ పార్టీ ఎప్పుడూ ప్రోత్సహించదని చెప్పారు. ఘటనకు బాధ్యులైన వారిపై పోలీసులు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ డిమాండ్ చేశారు.
కావలిలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి ఘటన దురదృష్టకరం. ఎవరో దాడికి పాల్పడితే వైయస్ఆర్సీపీకి సంబంధం ఉన్నట్టు @naralokesh చిత్రీకరించడం తగదు. ఇలాంటి దాడులను మా పార్టీ ఎప్పుడూ ప్రోత్సహించదు. ఘటనకు బాధ్యులైనవారిపై పోలీసు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి.
— YSR Congress Party (@YSRCParty) October 28, 2023
- ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్… pic.twitter.com/KWFmiypU7f