Mla Anil Kumar: తప్పు ఎలా అవుతుంది?.. నెల్లూరు ఘటనపై కౌంటర్

మతాన్ని గౌరవిస్తే తప్పు ఎలా అవుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు....

Update: 2022-11-26 12:53 GMT
Mla Anil Kumar: తప్పు ఎలా అవుతుంది?.. నెల్లూరు ఘటనపై కౌంటర్
  • whatsapp icon

దిశ వెబ్ డెస్క్: మతాన్ని గౌరవిస్తే తప్పు ఎలా అవుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ (Foremer Minister Anil Kumar Yadav) యాదవ్ అన్నారు. అయ్యప్పమాలలో ఉన్న ఆయన ముస్లిం టోపీ (Muslim Cap) పెట్టుకుని ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో బీజేపీ నేతలు (Bjp Leaders) ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ సంప్రదాయాన్ని కించపర్చారంటూ అనిల్ ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. ఈ ఆందోళన ఉద్రిక్తంగా మారడంతో పలువురు బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై తాజాగా అనిల్ కుమార్ స్పందించారు. తాను మందు తాగానా?.. మంసం తిన్నానా? అని ప్రశ్నించారు. మాలధారులు వావర్ స్వామిని దర్శించుకోవడంలేదా అని నిలదీశారు. నెల్లూరు రొట్టెల పండుగలో హిందువులు పాల్గోవడం లేదా అని వ్యాఖ్యానించారు. అజ్మీర్ దర్గాకు హిందువులు వెళ్లడం లేదా అని అనిల్ ప్రశ్నించారు. తనను తప్పుబట్టిన బీజేపీ నేతల నేతల విజ్ఞప్తికే వదిలేస్తున్నంటూ అనిల్ వ్యాఖ్యానించారు. 

READ MORE

చందు మనిషా? పశువా?..! 

Tags:    

Similar News