Corporator Vijay Bhaskar Reddy: నాకు ప్రాణ హాని.. రక్షణ కల్పించండి

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వల్ల తనకు ప్రాణ హాని ఉందని నెల్లూరు 22వ డివిజన్ కార్పొరేటర్ మూలే విజయ్ భాస్కర్ రెడ్డి ఆరోపణలు చేశారు.

Update: 2023-02-06 11:32 GMT
Corporator Vijay Bhaskar Reddy: నాకు ప్రాణ హాని.. రక్షణ కల్పించండి
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వల్ల తనకు ప్రాణ హాని ఉందని నెల్లూరు 22వ డివిజన్ కార్పొరేటర్ మూలే విజయ్ భాస్కర్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తమ ఇంటికి వచ్చి బెదిరించారని ఆయన తెలిపారు. కిడ్నాప్ చేయబోయి భయబ్రాంతులకు గురిచేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో తనకు ప్రభుత్వం వెంటనే రక్షణ కల్పించాలని కోరారు.

నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కార్యాలయంలో కార్పొరేటర్ మూలే విజయ్ భాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. చాలా మంది గుర్తు తెలియని తమ కార్యాలయం, ఇంటి చుట్టూ పక్కల తిరుగుతున్నారని ఆరోపించారు. తన కదలికలపై వీడియోలు తీస్తున్నారని స్పష్టం చేశారు. తనకు మద్దతుగా ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అతనికి కూడా బెదిరింపు ఫోన్ కాల్స్ వెళ్లాయని చెప్పారు. ఎన్ని బెదిరింపులు ఎదురైనా.. తన మద్దతు రూరల్ నియోజకవర్గం ఇన్‌చార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డికేనని చెప్పుకొచ్చారు. అంతేకాదు ప్రాణం పోయే వరకు జగన్ అన్నతోనే తన ప్రయాణం అని కార్పొరేటర్ మూలే విజయ్ భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు.

Tags:    

Similar News