Tdp Leader హర్ష కుటుంబానికి బాసటగా Chandrababu

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమారెడ్డి ఇంటి ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ టీడీపీ నేత హర్ష కుటుంబ సభ్యులు కలిశారు...

Update: 2022-12-31 10:32 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమారెడ్డి ఇంటి ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ టీడీపీ నేత హర్ష కుటుంబ సభ్యులు కలిశారు. నెల్లూరు జిల్లా కోవూరులో నార్త్ రాజుపాలెంలో ఉన్న చంద్రబాబును కలిసి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకున్నారు. తప్పుడు కేసులు పెట్టి పోలీసులు తమను వేధిస్తున్నారని చంద్రబాబు వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. హర్షను వైసీపీ నేతలు వేధించిన తీరును వివరిస్తూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ధైర్యంగా ఉండాలని, వేధించే పోలీసులను ఉపేక్షించేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. హర్ష ఇద్దరు పిల్లల చదువు బాధ్యత తాను తీసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. కేసు విషయమై పార్టీ తరపున పోరాటం చేస్తామని భరోసా ఇచ్చారు. హర్ష ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ప్రస్తుతం కోలుకుంటున్నట్లు వారు వివరించారు. పార్టీ తరపున అండగా ఉంటామని హర్ష కుటుంబ సభ్యులకు చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు.

Tags:    

Similar News