Stray Dog Feeding: వరదల్లో చిక్కుకొని ఆకలితో అలమటించిన కుక్క.. పాలు తాగించిన వలంటీర్

విజయవాడ వరదల్లో వాలంటీర్ చేసిన పనికి సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి....

Update: 2024-09-06 08:37 GMT

దిశ, వెబ్ డెస్క్: బురమేరు (Budameru) దెబ్బకు మనుషులే కాదు.. జంతువులు సైతం అలమటించిపోయాయి. నిలువ నీడ లేక కడుపుకింత కూడు లేక విలవిలలాడిపోయారు. అయితే మనుషులకు ప్రభుత్వం ఆహారం, నీళ్లు, పాలు పంపిణీ చేసింది. కానీ మూగజీవాలకు మాత్రం ఎలాంటి సాయం అందలేదు. కొన్ని జంతువులు వరదలోనే (Floods) ఆకలితో అలమటించాయి. మరికొన్ని జీవాలు నీళ్లలో కొట్టుకుపోయి ప్రాణాలు విడిచాయి. ఇంకా కొన్ని మూగ జీవాలు ఆహారంకోసం ఎదురు చూస్తున్నాయి. అయితే ఓ వాలంటీర్ చేసిన పని అందరినీ కదిలించింది. విజయవాడ (Vijayawada) వరదల్లో చిక్కుకుని ఆకలితో అలమిస్తున్న వీధి కుక్కకు పాలు తాగించారు. ఎంతో ఆకలితో ఉన్న ఆ కుక్క వాలంటీర్‌ను చూసి భయపడకుండా అతని దోసిట పోసిన పాలును తాగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో కుక్క ఆకలి తీర్చిన వాలంటీర్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 


Similar News