సిట్ దూకుడు.. రేపు తిరుపతిలో విచారణ

తిరుమల లడ్డూ వివాదం కేసుపై సిట్ అధికారులు దూకుడు పెంచారు..

Update: 2024-09-27 14:27 GMT

దిశ, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ వివాదం(Tirumala Laddu Controversy)పై విచారణకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.  అయితే సిట్ బృందం ప్రస్తుతం దూకుడు పెంచింది. తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ(Ghee Adulterated)పై దృష్టి పెట్టింది. తిరుపతిలో శనివారం విచారణ చేపట్టనుంది. ఇందులో భాగంగా తొలుత ఏఆర్ డెయిరీ సంస్థ(AR Dairy Company)పై నమోదు చేసిన కేసును విచారించనుంది. ఇప్పటికే ఏపీ డీజీపీ తిరుమలరావు(AP DGP Tirumala Rao)తో సిట్ టీమ్ సమావేశమై చర్చించింది. ఈ మేరకు శనివారం సిట్ బృందం(SIT team) తిరుపతి వెళ్లనుంది.

కాగా ఈ సిట్ టీమ్ చీఫ్‌గా సర్వశ్రేష్ఠ త్రిపాఠి వ్యవహరించనున్నారు. ఆయనతో పాటు పలువురు అధికారులు ఈ బృందంలో సభ్యులుగా పని చేయనున్నారు. తిరుమల లడ్డూ వివాదంపై త్వరగా విచారణ పూర్తి చేయాలనే యోచనలో ఉన్నారు. త్వరగా విచారణ పూర్తి చేసి సీఎం చంద్రబాబు(Cm Chandrababu)కు నివేదిక అందించనున్నారు. ఈ విచారణలో భాగంగా టీటీడీ మాజీ చైర్మన్లు, సభ్యులను సైతం విచారించనున్నారని తెలుస్తోంది.


Similar News