పోరాటపటిమను ఆస్తిగా ఇచ్చి.. ఫాదర్స్ డే రోజున షర్మిల స్పెషల్ ట్వీట్

ఫాదర్స్ డే సందర్భంగా ఏపీసీసీ చీఫ్ షర్మిల ట్విట్టర్ వేదికగా స్పెషల్ ట్వీట్ చేశారు.

Update: 2024-06-16 07:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఫాదర్స్ డే సందర్భంగా ఏపీసీసీ చీఫ్ షర్మిల ట్విట్టర్ వేదికగా స్పెషల్ ట్వీట్ చేశారు. ‘నీ పట్టువదలని పోరాటపటిమను ఆస్తిగా ఇచ్చి ఆగకుండా సాగిపోయేలా నన్ను తీర్చిదిద్దావు.. నీ అమూల్యమైన ఆత్మవిశ్వాసాన్ని నాలో నింపి సవాళ్ళను ఎదుర్కొనేలా తయారు చేసావు మనిషిని ప్రేమ, సంస్కారం, కరుణతో గెలవాలనే సూత్రంతో నా వ్యక్తిత్వాన్ని మలిచావు. నీ బిడ్డనైనందుకు గర్విస్తున్నాను ప్రజలకోసం పాటుపడే నీ ఓర్పును, నిబద్ధతను వారసత్వంగా చేసుకుని ముందుకు సాగుతున్నాను. నువ్వెక్కడున్నా నీ ఆశీర్వాదం, అనురాగం, మార్గదర్శనం నాతో ఉన్నాయని తలుస్తాను’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు వైఎస్‌తో పాత ఫొటోను జత చేశారు.


Similar News