షర్మిలకు సీఎం జగన్‌తో ప్రాణహానీ ఉంది : టీడీపీ నేత అయ్యన్న సంచలన వ్యాఖ్యలు
వైఎస్ షర్మిలకు సీఎం జగన్‌తో ప్రాణహానీ ఉందని టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: వైఎస్ షర్మిలకు సీఎం జగన్‌తో ప్రాణహానీ ఉందని టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ గత నాలుగేళ్లలో ప్రభుత్వ సంపదను దోచుకుందని ఆరోపించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు బనాయించిందని పేర్కొన్నారు. ఎక్కడ భూములు కనిపించినా.. వైసీపీ నేతలు కబ్జాలకు పాల్పడతున్నారని మండిపడ్డారు. అధికారం జగన్ ఎంతకైనా తెగిస్తాడని ఆయనకు తల్లి, చెల్లి, బాబాయ్ అనే తేడా లేదన్నారు. ఈ విషయంలో షర్మిలను అడ్డు తొలగించినా ఆశ్చర్యపోనక్కర్లేదని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు.