జగన్ సిగ్గుతో తల దించుకోవాలి.. ఢిల్లీలో రెచ్చిపోయిన షర్మిల
ఢిల్లీలో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశంపై ఆందోళన చేపట్టారు
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీలో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశంపై ఆందోళన చేపట్టారు. ఢిల్లీలోని ఏపీ భవన్ లో ముందు తన మద్దతుదారులతో కలిసి ధర్నా చేపట్టారు. ధర్నాలో మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్, ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ , రాష్ట్రంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ఆంధ్రులకు చేస్తున్న ద్రోహానికై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో మహా ధర్నా చేపట్టామని అన్నారు.
2014 లో బీజేపీ మేనిఫెస్టోని చూపిస్తూ.. బీజేపీ రాష్ట్ర విభజనకు సహకరించిందని అన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఐదేళ్లు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటిస్తే.. బీజేపీ మేం అధికారంలోకి వచ్చాక పదేళ్లు ఇస్తా్మని మేనిఫెస్టోలో చెప్పిందన్నారు. ప్రధాని మోదీ తిరుపతి సభలో పదేళ్లు హోదా ఇస్తామని, దుగ్గరాజపట్నం పోర్టు నిర్మిస్తామన్నారని గుర్తుచేశారు. అలాగే విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ తీసుకొస్తామిని, సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేస్తామని చెప్పారు కానీ, ఇప్పటివరకూ కనీసం విభజన చట్టంలోని హామీలను నెరవెర్చలేదని మండిపడ్డారు. చివరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రవేటీకరించాలని ప్రయత్నిస్తూ ఏపీకి మరోసారి ద్రోహం చేయాలని చూస్తున్నారని విమర్శించారు.
అలాగే సీఎం జగన్ 2019 లో 25 కు 25 సీట్లు గెలిపించాలని, అప్పుడు కేంద్రంలో ఎవరూ ప్రధానమంత్రి కావాలనుకున్నా.. ముందు ప్రత్యేక హోదాపై సంతకం పెట్టాకే మద్దతు ఇస్తామని అన్నారని తెలిపారు. కానీ ఇప్పుడు హోదా విషయమే మర్చిపోయి బీజేపీకి గులాంగిరి చేస్తున్నారని, జగన్ సిగ్గుతో తల దించుకోవాలని అన్నారు. ఏపీ ప్రజలను మోదీకి బానిసలుగా చేసే ప్రయత్నం చేస్తున్నారని, దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు.ఏపీకిహోదా ఎంత ముఖ్యమో అందరికీ తెలుసని అయినా వైసీపీ ఎంపీలు ఏమీ చేయలేకపోతున్నారని అన్నారు. మీ మధ్య ఉన్న రహస్య ఒప్పందాన్ని ప్రజలకు చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు.
Read More..
Breaking: వైసీపీ ఆరో జాబితా కాసేపట్లో.. ఆయన మాత్రం పక్కా.. !