బుడమేరు వాగు బీభత్సం..రైల్వే శాఖ సంచలన నిర్ణయం
విజయవాడలో భారీ వర్షాలు కురిశాయి...
దిశ, వెబ్ డెస్క్: విజయవాడలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో వరద గుప్పిట్లోకి టెంపుల్ సిటీ వెళ్లింది. మరోవైపు బుడమేరు ఉప్పొంగడంతో విజయవాడ సిటీ మోకాళ్లోతు నీట మునిగింది. కొన్ని ప్రాంతాల్లో భుజాల వరకూ నీళ్లు నిలిచిపోయింది. అటు విజయవాడ రైల్వే పరిధిలో పలు స్టేషన్లలో రైల్వే ట్రాక్‌పై భారీగా నీళ్లు చేరాయి. దీంతో పలు రైళ్లు నిలిచిపోయాయి. కొండపల్లి, రాయనపాడులో ట్రాక్‌పైనే వరద నీరు ఉంటడంతో మూడు రైళ్లు ఆగిపోయాయి. దీంతో 40 ప్రత్యేక బస్సుల్లో ప్రయాణికులను తరలిస్తున్నారు. ఇప్పటికే 2 వేల మందిని బస్సుల్లో విజయవాడ రైల్వే స్టేషన్‌కు తరలించారు. అయినా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. విజయవాడ డివిజన్ పరిధిలో 132 రైళ్లను రద్దు చేసింది. 93 రైళ్లు దారి మళ్లించింది. తాత్కాలికంగా 9 రైళ్లను రద్దు చేసింది. ప్రయాణికులు గమనించాలని కోరింది.