Breaking: ఏపీలో ముందస్తు ఎన్నికలు.. తేల్చి చెప్పేసిన సజ్జల రామకృష్ణారెడ్డి
ఏపీలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని, అందుకే సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రధాని మోదీతోపాటు పలువురు కేంద్రమంత్రులను కలిశారని ప్రచారం జరుగుతోంది. ...
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని, అందుకే సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రధాని మోదీతోపాటు పలువురు కేంద్రమంత్రులను కలిశారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. చాలా సార్లు ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు వెల్లడించారు. ముందస్తు ఎన్నికలపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలిపారు. జగన్ మోహన్ రెడ్డికి ప్రజలు ఇచ్చిన ఐదేళ్ల కాలం వరకూ ఉంటామని తెలిపారు. ఐదేళ్ల కాలం చివరి వరకూ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని పాలిస్తారని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.
ముందస్తు ఎన్నికలు చంద్రబాబు చేస్తున్న గేమ్ ప్లాన్ అని సజ్జల పేర్కొన్నారు. చంద్రబాబు ఏం చేసినా రాష్ట్రంలో మాత్రం ముందస్తు ఎన్నికలు రావని స్పష్టం చేశారు. ప్రజలెవరూ ఆందోళనకు గురి కావొద్దని సూచించారు. మరోసారి వైసీపీ అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పారు.ప్రభుత్వం చేపట్టిన పథకాలే జగన్ ను మళ్లీ చేస్తాయని సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.