వాలంటీర్ వ్యవస్థను ఎవ్వరూ ఏం చేయలేరు : సజ్జల
ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న కారణంగా వాలంటీర్లతో పింఛన్లు పంపిణీ చేయించొద్దని రీసెంట్ గా ఈసీ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న కారణంగా వాలంటీర్లతో పింఛన్లు పంపిణీ చేయించొద్దని రీసెంట్ గా ఈసీ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఏపీలో వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటికే 400 మంది రాజీనామా చేసినట్లు సమాచారం. అయితే ఈ ఇష్యూపై తాజాగా ఏపీ రాష్ట్ర సలహా దారుడు సజ్జల స్పందించి.. ‘‘వాలంటీర్లపై కావాలనే టీడీపీ రాద్ధాంతం చేస్తోంది. వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. వాలంటీర్లపై చంద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఇవాళ వృద్ధులు ఎండల్లో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది.
వాలంటీర్ వ్యవస్థపై నిమ్మ గడ్డ రమేష్ ద్వారా ఫిర్యాదు చేయించారు.ప్రజల్లో తిరుగుబాటు వచ్చేసరికి వాలంటీర్లకు సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. చంద్రబాబుకు స్వార్థం తప్ప మరేమి పట్లదు. మరో రెండు మూడు రోజుల్లో పంపిణీ పూర్తవుతుంది. వాలంటీర్లను అడ్డుకుని ఇప్పుడు మాపైనే విమర్శలు చేస్తారా? చంద్రబాబు కుట్రలను ప్రజలు అర్థం చేసుకున్నారు. కూటమి పార్టీలన్నీ అధికారులపై ఒత్తిడి తెస్తున్నాయి. టీడీపీ , జనసేన, బీజేపీ కక్ష పూరితంగా వ్యవహరిస్తోంది. ఈసీపై ఒత్తిడి తేవడంతో అధికారుల బదిలీ జరుగుతోంది. చంద్రబాబు, పురంధేశ్వరి ఫెయిల్యూర్ నేతలు.’’ అంటూ సజ్జల మండిపడ్డారు.