Sajjala Bhargav Reddy: సజ్జల భార్గవ్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు.. బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
వైసీపీ సోషల్ మీడియా చీఫ్ సజ్జల భార్గవ్ రెడ్డి (Sajjala Bhargav Reddy)కి ఏపీ హైకోర్టు (AP High Court)లో చుక్కెదురైంది.
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ సోషల్ మీడియా చీఫ్ సజ్జల భార్గవ్ రెడ్డి (Sajjala Bhargav Reddy)కి ఏపీ హైకోర్టు (AP High Court)లో చుక్కెదురైంది. తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఇవాళ ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది. రాష్ట్రంలో అధికార పార్టీ ఆదేశాలతోనే వైసీపీ (YCP) పార్టీ నాయకులు, కార్యకర్తలు తప్పుడు కేసులు బనాయిస్తున్నారని భార్గవ్ రెడ్డి (Bhargav Reddy) తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఒక పోస్ట్ పెడితే.. శ్రీకాకుళం (Srikakulam) నుంచి కుప్పం (Kuppam) వరకు రాష్ట్రమంతా కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. సుప్రీం కోర్టు (Supreme Court) మార్గదర్శకాలు పాటించకుండా పోలీసులు వందల సంఖ్యలో కేసులు పెట్టడం వల్ల అనేక మంది ఇబ్బందులు పెడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.