స్టీల్‌ప్లాంట్ విలీనంపై సెయిల్ ఇండిపెండెంట్ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు
విశాఖ స్టీల్‌ప్లాంట్ విలీనంపై సెయిల్ ఇండిపెండెంట్ డైరెక్టర్ విశ్వనాథరాజు కీలక వ్యాఖ్యలు చేశారు..
దిశ, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్‌ప్లాంట్(Visakha Steel Plant) విలీనంపై సెయిల్ ఇండిపెండెంట్ డైరెక్టర్ విశ్వనాథరాజు( Sail Independent Director Viswanatharaju) కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్‌ప్లాంట్ అప్పుల ఊబి నుంచి గట్టెక్కాలంటే సెయిల్‌లో విలీనం చేయాలని ఆయన తెలిపారు. సొంతగనులు కేటాయించినా స్టీల్‌ప్లాంట్ కోలుకోదని తేల్చి చెప్పారు. స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో కలిపితేనే శాశ్వత పరిష్కారం దొరుకుతుందన్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లామన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సైతం సానుకూలంగా ఉన్నారని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ అంశంపై ఢిల్లీలో కేంద్ర ఉక్కుశాఖ మంత్రులను సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం కలవబోతున్నారు. స్టీల్ ప్లాంట్‌పై ఢిల్లీ పెద్దల నుంచి మంగళవారం సానుకూల నిర్ణయం రావొచ్చన్నారు. సెయిల్‌లో స్టీల్‌ప్లాంట్ విలీనమైతే ఉద్యోగ భద్రతతో పాటు విస్తరణ జరిగే అవకాశం ఉందని విశ్వనాథరాజు పేర్కొన్నారు.