మాజీ CM జగన్‌తో రోజా రాఖీ వేడుకలు.. స్పెషల్ అట్రాక్షన్‌గా పవన్ కళ్యాణ్ సాంగ్ (వీడియో)

సోదర సోదరీమణుల మధ్య బంధానికి ప్రతీకగా రక్షా బంధన్ (రాఖీ పండుగ)ను జరుపుకుంటారు.

Update: 2024-08-19 10:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: సోదర సోదరీమణుల మధ్య బంధానికి ప్రతీకగా రక్షా బంధన్ (రాఖీ పండుగ)ను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన పండుగను శ్రావణ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. అయితే సందర్భంగా వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ మోషన్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని మాజీ మంత్రి రోజా రక్షా బంధన్ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. గతంలో ఆయనకు కట్టిన రాఖీ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ క్రమంలో ఆ ఫొటోలను పవన్ కల్యాణ్ అన్నవరం సినిమాలోని ‘అన్నయ్యా అన్నావంటే.. ఎదురవనా?’’ అనే పాటను యాడ్ చేశారు. ఈ పోస్టు కింద పవన్ కల్యాణ్ అభిమానులు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. రాగా, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రోజా ఓటమి చెందారు. అప్పటి నుంచి కాస్త రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన వైసీపీ కేవలం 11 స్థానాల్లో గెలుపొందింది.

Read More..

Raksha Bandhan: సిస్టర్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ చిత్రాలివే 


Click Here For Twitter Post..

Tags:    

Similar News