RK Roja: చంద్రబాబు, అనిత.. ఈ వీడియో మీ కోసమే.. ఆర్కే రోజా సంచలన పోస్ట్

సీఎం చంద్రబాబు(CM Chandrababu), హోంమంత్రి వంగళపూడి అనిత(Home Minister Vangalapudi Anita) ఈ వీడియో మీ కోసమే.. అని మాజీమంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా(YCP Leader RK Roja) సంచలన పోస్ట్ పెట్టారు.

Update: 2024-11-10 17:11 GMT
RK Roja: చంద్రబాబు, అనిత.. ఈ వీడియో మీ కోసమే.. ఆర్కే రోజా సంచలన పోస్ట్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు(CM Chandrababu), హోంమంత్రి వంగళపూడి అనిత(Home Minister Vangalapudi Anita) ఈ వీడియో మీ కోసమే.. అని మాజీమంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా(YCP Leader RK Roja) సంచలన పోస్ట్ పెట్టారు. బెల్ట్ షాపు(Belt Shop)లో చిన్న పిల్లాడు పని చేస్తున్న వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఆమె.. పలు విమర్శలు చేశారు. ఈ సందర్భంగా రోజా.. ఇదిగోండి.. ఇదెక్కడో కాదు.. టీడీపీ మేథావి యనమల రామకృష్ణుడి(Yanamala Ramakrishna) సొంత మండలం.. హోంమంత్రి అనిత పక్క నియోజకవర్గంలో అని వీడియోను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.

మైనర్ బాలుడిని పెట్టి బెల్టు షాపు నడిపిస్తున్నారని, ఈ బెల్టు షాప్ వైన్ షాపును తలదన్నేలా ఉందని చెప్పారు. బెల్టు షాపు కనిపిస్తే.. బెల్టు తీస్తానన్న సీఎం చంద్రబాబు.. నన్ను బెల్టు షాపు ఎక్కడుందో చూపించమన్న హోంమంత్రి అనిత.. మీ కోసమే ఈ వీడియో పోస్ట్‌ చేస్తున్నానని చెబుతూ వారిని ట్యాగ్ చేశారు. అంతేగాక తుని నియోజకవర్గం(Tuni Constituency)లోని తొండంగి మండలం(Tondangi Mandal) ఆనూరు(Anur)లో ఈ బెల్టు షాపు ఉంది సార్ అని ఏపీ పోలీస్(AP Police) ను ట్యాగ్ చేశారు. ఇక పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) మంచి ప్రభుత్వం అంటే ఇదేనా? అంటూ సిగ్గుచేటు!! అని వైసీపీ నేత రాసుకొచ్చారు. 

Tags:    

Similar News