ఎర్రచందనం కేసు.. తండ్రి కొడుకులకు ఐదేళ్ల జైలు శిక్ష

తిరుపతి డివిజన్ కరకంబాడి బీటు కృష్ణాపురం సెక్షన్లో తీండ్రగుంటలో ఎర్రచందనం కేసులో పట్టుబడ్డ ఇద్దరు ముద్దాయిలు తండ్రి కొడుకులు అయిన తోట చిన్న చెంగయ్య, తోట చెంగయ్యలకు కోర్టు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

Update: 2024-11-13 14:40 GMT

దిశ ప్రతినిధి, కడప: తిరుపతి డివిజన్ కరకంబాడి బీటు కృష్ణాపురం సెక్షన్లో తీండ్రగుంటలో ఎర్రచందనం కేసులో పట్టుబడ్డ ఇద్దరు ముద్దాయిలు తండ్రి కొడుకులు అయిన తోట చిన్న చెంగయ్య, తోట చెంగయ్యలకు కోర్టు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం సిరివరం గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు తిరుపతి ఆర్ యస్‌ యస్ ఎడిజె కోర్టు జడ్జి నరసింహ మూర్తి వీరిద్దరికీ ఐదేళ్ల శిక్షతో పాటు ఆరు లక్షల జరిమానా విధించారు. కోర్టు ఆదేశాలు మేరకు ముద్దాయిలను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ లోని శేషాచలం రిజర్వ్ ఫారెస్ట్ లోని చాలా విలువైన సహజ సంపద అయిన ఎర్రచందనం చెట్లు నరికి అక్రమ రవాణా చేసే నేరస్తులకు ఇది ఒక హెచ్చరికగా పనిచేస్తుందని ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం ఎస్పీ(ఎఫ్ ఎసి)యేల్.సుబ్బరాయుడు పేర్కొన్నారు.


Similar News