‘నోటి దురుసే మా కొంప ముంచింది’.. రియలైజ్ అయిన మాజీ మంత్రి అనిల్

తమకు తొందర లేదని.. కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇస్తామని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.

Update: 2024-06-13 08:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: తమకు తొందర లేదని.. కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇస్తామని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నామని.. తమకు గెలుపోటములు కొత్త కాదని చెప్పారు. లోపాలు సరిదిద్దుకొని ముందుకు వెళ్తామని అన్నారు. ఎక్కడికీ పారిపోమని.. ప్రజలకు అందుబాటులో ఉంటామని చెప్పారు. కేవలం నోటిదురుసు వల్లే ఇవాళ తాము ఓడిపోవాల్సి వచ్చిందని అంటున్నారు.. అదే నిజమైతే సరిదిద్దుకునేందుకు ట్రై చేస్తామని అన్నారు. కాగా, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. మొత్తం 175 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వైసీపీ కేవలం 11 స్థానాల్లోనే గెలుపొందింది. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి 164 సీట్లలో ఘన విజయం సాధించి అధికారాన్ని చేజిక్కించుకున్నది. వైసీపీలో మంత్రులుగా పనిచేసిన కీలక నేతలంతా ఓటమి చెందడం గమనార్హం.


Similar News