Rajahmundry: మరోసారి చిరుత కలకలం.. తీవ్ర ఆందోళనలో స్థానికులు

Update: 2024-09-16 05:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాజమండ్రి శివారులో తాజాగా చిరుత (Cheetah) మరోసారి కలకలం సృష్టిస్తోంది. దివాన్ చెరువు (Diwan Cheruvu) ఫార్టెస్ట్ ఏరియాలో అమర్చిన ట్రాప్ కెమెరా (Trap Camera)లో చిరుత మూమెంట్స్ స్పష్టంగా కనిపించాయి. దీంతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు (Forest Department Officials) దివాన్ చెరువు అటవీ ప్రాంతంలోనే చిరుత ఉన్నట్లుగా నిర్ధారించి స్థానికులు ఎవరూ బయటకు రావొద్దని సూచనలు చేశారు. ట్రాప్ బోనులను ఏర్పాటు చేసి చిరుతను బంధించేందుకు అటవీ శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడ ఉన్న స్థానికులు ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. ముఖ్యంగా రాజమండ్రి హౌసింగ్ బోర్డు కాలనీ (Rajahmundry Housing Board Colony), ఆటోనగర్ (Auto Nagar) అటవీ ప్రాంతానికి అనుకుని ఉండటంతో ఆ పరిసర ప్రాంతాల ప్రజల తల్లిదండ్రులు తమ పిల్లలను సాయంత్రం వేళల్లో బయటకు వెళ్లకుండా చూసుకోవాలని అటవీ శాఖ అధికారులు తెలిపారు.  


Similar News