ఏపీకి వాతావరణశాఖ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాలకు వర్షసూచన

ఏపీకి వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. కొన్ని జిల్లాలకు

Update: 2023-10-31 03:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీకి వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. కొన్ని జిల్లాలకు నేడు వర్షసూచన జారీ చేసింది. పల్నాడు, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, నంద్యాల, తిరుపతి, అన్నమయ్య, , కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశముందని అంచనా వేసింది. ఇక మరికొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత ఉంటుందని, ఉష్ణోగ్రతలు పెరుగతాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

కొన్ని జిల్లాల్లో ఎండ ప్రభావం ఎక్కువైంది. దీంతో ఎండాకాలన్ని తలపిస్తోంది. గరిష్ట ఉష్ణోగ్రతలు పలు జిల్లాల్లో 31 నుంచి 33 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. అలాటే రాత్రివేళల్లో కూడా 21 నుంచి 23 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి. నెల రోజులుగా కొన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఎండతో పాటు ఉక్కబోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇటు తెలంగాణలో కూడా భానుడు భగ్గుమంటున్నాడు. ఉదయం నుంచే ఎండలు మొదలుకావడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.


Similar News